![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకి పండగ రాబోతుంది. ఎస్ .. గత కొన్ని నెలలుగా రిషి లేకుండానే గుప్పెడంత మనసుని రన్ చేస్తున్నారు. అయితే రిషి, వసుధారల ప్రేమకథని ఆన్ స్క్రీన్ మీద చూసేవారు, అభిమానించే చాలామంది ఉన్నారు. రిషి సర్ రావాలి.. అని ఎదురుచూసే ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. అయితే ఆ రోజు రానే వచ్చింది.
గుప్పెడంత మనసు సీరియల్ లోని నిన్నటి ఎపిసోడ్ లో.. వసుధార పూజా కార్యక్రమానికి వెళ్తుంది. అక్కడ ధరణి తాంబూలం ఇస్తుంటే.. అక్కడి అమ్మలక్కలు రిషి చనిపోయాడు.. వద్దని అనగా వసుధార ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత దేవయాని, వసుధారల మాటలు ఆసక్తికరంగా మారాయి.
గతంలో వసుధార.. సరిగ్గా మూడు నెలల సమయం కావాలి. నా రిషి సర్ ఈ లోకంలో ఎక్కడున్నా తీసుకొస్తానని శపథం చేస్తుంది. "మూడు నెలలు అన్నావ్. ఆ మూడు నెలలు పూర్తి కావడానికి సరిగ్గా వారం ఉంది.. ఈ లోపు రిషీని తీసుకుని రాలగలవా? రాకపోతే.. రిషి లేడని ఒప్పుకోగలవా" అని దేవయాని అంటుంది. తీసుకొస్తానని వసుధార కాన్ఫిడెంట్ గా చెప్తుంది.
ఇక తాజాగా స్టార్ మా ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఓ వీడియోని షేర్ చేశారు. రిషి ఆటోవాలా గెటప్ లో వసుధార వెనకాల ఉండగా.. వసుధారని తోసేసి రిషి స్క్రీన్ మీదకి వస్తాడు. దాంతో మనకి అర్థమైపోతుంది. రిషి సర్ ఆటోవాలా గెటప్ లో రాబోతున్నాడు. అంటే రిషి తనకి తగిలిన గాయాలకి గతం మర్చిపోయాడేమో, ఆ తర్వాత ఎక్కడో ఆటో నడుపుకుంటు ఉండగా.. వసుధార చూస్తుందేమో. అయితే రానున్న ఎపిసోడ్లలో రిషి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎలా వస్తాడు.. కథలో రిషి గతం మర్చిపోయిన వాడిలా వస్తాడా? లేక అన్నీ గుర్తున్న రిషి వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక రిషి, వసుధారలని ఆన్ స్క్రీన్ మీద చూసి గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు.. వి ఆర్ వెయిటింగ్ ఫర్ దిజ్ సర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
![]() |
![]() |